NLR: దుగరాజపట్నంలో పోర్టు పనులు వెంటనే ప్రారంభించాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. శనివారం గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో విలేకరులతో మాట్లాడారు. గూడూరు మరో వైజాగ్, చెన్నైలా అభివృద్ధి చెందాలంటే దుగరాజపట్నం పోర్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోర్టు నిర్మించాలని నినాదాలు చేశారు. ఆయన వెంట రామకృష్ణారావు, పి.చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.