జార్ఖండ్‌లో ఎన్నికల వేళ దేవ్‌గఢ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ’10 సంవత్సరాలలో కాంగ్రెస్-జెఎంఎం ఢిల్లీ (కేంద్ర ప్రభుత్వం) నుండి రూ. 84,000 కోట్లు పొందాయి. వారు 2004-2014 వరకు రూ. 84,000 కోట్లు అందుకున్నారు. కానీ ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక 2014-2024 మధ్య రూ. 3,90,000 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బును రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం జేబులో వేసుకుంది.