VZM: ప్రణాళికలతో పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీపీ అంబల్ల సుధారాణి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యదర్శులకు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు 2025-26 శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.