అర్ష్‌దల్లా అరెస్టుపై భారత అధికారులతో చర్చిస్తున్నట్లు కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. ఇటీవల ఓ కాల్పుల కేసులో అరెస్టయిన అర్ష్‌దల్లా.. ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ సన్నిహితుడుగా గుర్తించారు. ఈ క్రమంలో అతడిని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరింది. అర్ష్దల్లాను అప్పగించే అంశంపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో చర్చిస్తున్నట్లు మెలానీ జోలీ పేర్కొన్నారు.