TG: ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా రేవంత్ రాజన్నను దర్శించుకోవడంతో పాటు దేవాలయ అభివృద్ధి, టెక్స్ టైల్ ఇండస్ట్రీ, ఇరిగేషన్ సహా ఆ ప్రాంతానికి సంబంధించిన పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు. విజయోత్సవాల సందర్భంగా 19న వరంగల్ మహిళ సదస్సు, 20న కరీంనగర్లో యువజన సదస్సు, తదుపరి మహబూబ్ నగర్లో రైతు సదస్సు నిర్వహిస్తామన్నారు.