TG: జాతీయ భావం, ప్రాంతీయ తత్వం తమ పార్టీల సిద్దాంతమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్రలోని డెగ్లూర్లో ఆయన మహాయుతి కూటమి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. బాలసాహెబ్ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. శివసేన, జనసేన పార్టీలు సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయని తెలిపారు. ఈ రెండు పార్టీలు అన్యాయంపై పోరాడతాయని పేర్కొన్నారు.