మణిపూర్లో హింసపై కేంద్ర హోంశాఖ తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. మణిపూర్లో శాంతిభద్రతల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భద్రత బలగాలకు ఆదేశాలు జారీ చేశామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మణిపూర్లో హింసాత్మక ఘటనలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.