TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ చేయించానన్న ఆరోపణలతో నోటీసులిచ్చారని అన్నారు. అడిషనల్ ఎస్పీ(సస్పెండెడ్) తిరుపతన్న ద్వారా ట్యాపింగ్ చేయించాననే ఆరోపణలతో నోటీసులిచ్చారని ఆరోపించారు.