HYD: ఎండల తీవ్రత, మితిమీరిన వినియోగంతో నగర పరిధిలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. మే నెలాఖరుకు సగటు నీటిమట్టం 12 మీటర్లు కాగా.. కుత్బుల్లాపూర్లో గరిష్టంగా 37 మీటర్లు, కూకట్పల్లిలో 27 మీటర్ల లోతుకు చేరింది. నగరవ్యాప్తంగా వేల సంఖ్యలో బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో నీటి ఎద్దడి తీవ్రమై, ఒకే రోజు రికార్డు స్థాయిలో 17 వేలకు పైగా ట్యాంకర్లు బుక్ అయినట్లు అధికారులు తెలిపారు.