TG: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మాజీమంత్రి KTR అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం ఆగకుండా అభివృద్ధిని పరుగులు పెట్టించారని తెలిపారు. ‘పైరవీల కోసం కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే.. కానీ కార్యకర్తలు మాత్రం BRS వెంటే ఉన్నారు. BRS ఫినిష్ చేస్తానని CM రేవంత్ అంటున్నారు. గతంలో ఇలా అన్న వాళ్ళందరూ రాష్ట్రంలో లేకుండా పోయారు’ అని పేర్కొన్నారు.