VZM: జాతీయ పత్రికా దినోత్వవం సందర్బంగా జిల్లా గ్రంథాలయ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పత్రికారంగంలో పలువురు పాత్రికేయులకు శనివారం ఘనంగా సన్మానించారు. దీనిలో భాగంగా జిల్లాకు చెందిన జర్నలిస్ట్ కంది గౌరి శంకర్‌ను సత్కరించి, ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్, ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.