చలికాలం వచ్చిందంటే ప్రతిఒక్కరూ వేడి నీటి కోసం హీటర్ కొనాలనుకుంటారు. అయితే, కొనుగోలు చేసేముందు ఏయే వాటర్ హీటర్లో ఎంత రేటింగ్ ఉందో చూసి తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులో వాటర్ స్టోరేజ్, ఇన్స్టాంట్, సోలార్ అనే 3 రకాలు హీటర్లు ఉంటాయి. మొదటిది వేడి నీటిని ఎక్కువ స్టోర్ చేస్తుంది. రెండోది నీటిని తర్వగా వేడి చేస్తాయి. మూడోది ధర ఎక్కువైనా ఎండా, వేడి వాతావరణంలో మన్నికగా ఉంటుంది. విద్యుత్ ఖర్చు కూడా పెద్దగా ఉండదు.