AP: వైసీపీ ప్రభుత్వం వచ్చాక కక్ష సాధింపులే పనిగా పెట్టుకుందని మంత్రి నారాయణ విమర్శించారు. టిడ్కో ఇళ్లపై ఆయన శాసనసభలో చర్చించారు. పేదవాళ్లకు ఇళ్ల నిర్మాణాలపై అనేక అధ్యయనాలు జరిగాయని అన్నారు. ఇతర దేశాల్లోనూ తిరిగి ఇళ్ల నిర్మాణంపై ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు. 7 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆనాడు నిర్ణయం జరిగిందని, 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు.