TG: మూసీ బాధితులకు సాయం చేసేందుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే పార్టీ మారినా.. బీఆర్ఎస్కు నష్టం జరగదని అన్నారు. ఈ నియోజకవర్గంలో చాలా మంది మూసీ వల్ల బాధపడుతున్నారని విమర్శించారు.