PDPL: ఓదెల మండలంలోని గుంపుల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అధికారి ఏఈవో కిరణ్ పరిశీలించారు. సన్నరకం వడ్లను పరిశీలించి రైతులకు టోకెన్లు అందజేశారు. వారు మాట్లాడుతూ.. రైతులందరూ తేమశాతం 17% లోపు రైతులు వడ్లను ఆరబెట్టాలని తెలిపారు. రైతులందరూ తమ పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అందించాలని సూచించారు.