UP: ఝాన్సీలోని వైద్య కళాశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు చనిపోయారు. ఈ కేసులో కీలక విషయం బయటకు వచ్చింది. ఓ నర్సు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యేక్ష సాక్షి ఆరోపించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు ఆక్సిజన్ సిలిండర్ పైప్‌ను కనెక్ట్ చేస్తుండగా.. దాని పక్కన మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించిందని తెలిపాడు. అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నాడు.