TG: ఓ అమ్మాయి 27 ఏళ్ల తర్వాత అబ్బాయి అని తెలిసింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఓ దంపతులకు 1996లో అమ్మాయి జన్మించింది. ఆమెకు కావ్యశ్రీ అని పేరు పెట్టారు. 2018 నుంచి ఆమెకు గడ్డం, మీసాలు రావడంతో వైద్యులు జన్యులోపం అని చెప్పారు. కానీ ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో.. బెంగళూరులో ఆస్పత్రిలో చూపించగా.. అబ్బాయి అనే విషయం బయటపడింది. జన్యులోపం వల్ల వృషణాలు లోపల వృద్ధి చెందాయట. కావ్యశ్రీ కాస్త కార్తీకేయగా మారాడు.