ఓటు బ్యాంకు రాజకీయాలకు తాము దూరంగా ఉన్నామని ప్రధాని మోదీ చెప్పారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో పాల్గొన్న మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన 26/11 ముంబయి పేలుళ్ల ఘటనకు సంబంధించిన కథనాలను చూశారు. ఈ సందర్భంగా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. తమ హయాంలో ఉగ్రవాదులు వారి ఇళ్లల్లోనే భయంతో బతుకుతున్నారన్నారు.