AP: సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. అసెంబ్లీ జీరో అవర్‌లో వాసు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యే భవానీ అప్పట్లో మాట్లాడిన వ్యాఖ్యలను ట్రోల్ చేశారని, గత స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినా స్పందించలేదన్నారు. ఇదే సమయంలో ఐదేళ్లలో దిశ చట్టం పేరిట జరిగిన దుర్వినియోగంపైనా విచారణ జరిపించాలని కోరారు.