రైల్వే ప్రాంగణాలు, కోచ్లలో రీల్స్ చేసే వారిపై రైల్వే బోర్డు దృష్టి పెట్టింది. ఇకపై ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. రీల్స్ చేస్తూ ఇబ్బందులు కలిగించే వారిపై FIR నమోదు చేయాలని అన్ని జోన్లకు సూచించింది. రైల్వే ట్రాక్లు, కదులుతున్న రైళ్లలో ప్రమాదకరంగా స్టంట్స్లతో వీడియోల చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.