AP: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్ట్ అయిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు కడప జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. ఆ తరువాత కడప కోర్టులో పులివెందుల పోలీసులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. అతన్ని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే కస్టడీ పిటిషన్పై విచారణకు కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.