హర్యానాకు చెందిన అన్మోల్ అనే దున్న ఖరీదు రూ.23 కోట్లు. ఇది 1500 కిలోల బరువు ఉంది. అగ్రికల్చర్ ఫెయిర్స్లో అలరిస్తోంది. దీని పరిమాణం, వంశపారంపర్యత, సంతానోత్పత్తి సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఆహారం కోసం రోజూ రూ.1500 ఖర్చు చేస్తామని యజమాని చెప్పారు. నిత్యం 250 గ్రాముల బాదం, 30 అరటి పండ్లు, 4 కిలోల దానిమ్మ, 5 లీటర్ల పాలు, 20 ఎగ్స్, ఆయిల్ కేక్, పచ్చి మేత, నెయ్యి, సోయా బీన్స్, మొక్కజొన్న ఇస్తున్నట్లు చెప్పారు.