SKLM: జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరారెడ్డి శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజా ఫిర్యాదుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల నుండి వినతులను స్వయంగా స్వీకరించారు. అనంతరం నడవలేని వృద్ధులు వద్దకు స్వయంగా వెళ్లి మరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.