‘కంగువా’ సినిమాలోని కొన్ని సీన్స్‌లో సౌండ్ ఎక్కువగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ స్పందించారు. ఇలాంటి సినిమాల్లో మ్యూజిక్ అందించడం యుద్ధంతో సమానమని, ఈ విషయంలో ఎవరిదీ తప్పు అని చెప్పలేమని తెలిపారు. సినిమాను తెరకెక్కించే క్రమంలో జరిగే చిన్న తప్పుల వల్ల దాని మొత్తం విలువ కోల్పోతుందని, దీని వల్ల రిపీటెడ్ ఆడియన్స్ ఉండరని పేర్కొన్నారు.