SKLM: మందస మండలం సువర్ణపురం గ్రామంలో ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి. శివాలయంలో పూజలు చేస్తుండగా అకస్మాత్తుగా ఎలుగుబంట్లు ప్రత్యక్షమవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం అక్కడి నుంచి పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.