క్విక్ కామర్స్ నమూనా రిటైలర్లకు సవాళ్లు విసురుతోందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. భారత్‌ను ప్రపంచంలోనే వినూత్నమైన దేశంగా పేర్కొంటూ.. మరెక్కడా క్విక్ కామర్స్ నమూనా అంత సత్ఫలితాలు సాధించలేదని, ఇక్కడ మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నట్టు చెప్పారు. భారత వ్యాపార సంస్థలు ఉత్పాదకత, సృజనాత్మకతపై దృష్టి సారించాలని సూచించారు.