TG: HYDలో లోక్‌మంథన్ జరగడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శిల్పకళా వేదికలో ఈనెల 21 నుంచి 24 వరకు లోక్‌మంథన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, విదేశీ అతిథులు పాల్గొంటారని చెప్పారు. ఈనెల 21న స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని.. 22న లోక్‌మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని వెల్లడించారు.