AP: అసెంబ్లీకి రాని సభ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ అంటే గౌరవం లేనివారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్.. అసెంబ్లీకి రాకుండా ఇంట్లో ఉంటా అంటే కుదరదని మండిపడ్డారు. రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి ఎన్నికలు నిర్వహించినట్లు చెప్పారు. ఒక విద్యార్థి పరీక్షలు రాయకపోతే అతడిని పాస్ చేస్తారా? అని ప్రశ్నించారు.