TG: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో సంక్షేమం మాయమైంది.. అభివృద్ధి దూరమైందని విమర్శించారు. వందలాది గురుకుల పాఠశాలల, వసతిగృహాల విద్యార్థులు రోడ్డెక్కున్నారన్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకులల్లో నిప్పులు పోశారని ధ్వజమెత్తారు.