PLD: గత ప్రభుత్వ హయాంలో తన తల్లిని అవమానించారని, అందుకే చంద్రబాబు శాసనసభను బహిష్కరించారని అసెంబ్లీలో మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మాజీమంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నిన్న శాసనసభలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ‘X’లో స్పందించారు. శాసనసభలో లోకేష్ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే తాను బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తానన్నారు.