VSP: విశాఖ డెయిరీపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర సహకార శాఖ స్పందించింది. డెయిరీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం ఆదేశించినట్లు కార్పొరేటర్ తెలిపారు.