ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్కు గాయమైనట్లు సమాచారం. ఫిజియోథెరపిస్ట్తో కలిసి రాహుల్ మైదానాన్ని వీడాడు. దీంతో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ టెస్టులో కేఎల్ ఆడటంపై అభిమానుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.