ప్రకాశం: కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. ప్రధానంగా చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన భైరవకోనలో భక్తులు గురువారం తెల్లవారుజాము త్రిముఖ దుర్గామా దేవి అమ్మవారికి, నాగ బహిరవేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.