AP: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ‘ఆర్థిక ఇబ్బందులున్నా ఈ ప్రాజెక్టుకు రూ.1,600 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తి చేసి టైం షెడ్యూల్ ఇచ్చాం. CM తొలి ప్రాధాన్యత పోలవరం. రెండో ప్రాధాన్యత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. 2025 జూలై నాటికి గోదావరి వరద జలాలు ఉత్తరాంధ్రకు తరలిస్తాం. ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటాం’ అని అన్నారు.