GNTR: బాపట్ల జిల్లా దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదివే విద్యార్థి వరుణ్ తేజ్ చెరువులో ఈతకు వెళ్లి దుర్మరణం చెందడంపై మంత్రి సవిత శుక్రవారం విచారం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థి వరుణ్ మృతి ఎంతో బాధాకరమన్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు తన సానుభూతిని తెలిపి, కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.