MBNR: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఈ నెల 10న (ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జాతర పరిసరాలను జిల్లా ఎస్పీ జానకి, వివిధ శాఖల అధికారులతో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హెలిప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించారు.