AP: ఎమ్మెల్యే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఈ నెల 25కు విచారణ వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ CID అధికారి విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంలో పిటిషన్ వేశారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై రిజాయిండర్ దాఖలుకు విజయ్ పాల్ తరపు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో కోర్టు రెండు వారాల గడువుచ్చింది. ఈ మేరకు విచారణ వాయిదా వేసింది.