శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాలకు తగ్గట్లే కేటాయిస్తామే తప్ప వేలం వేయబోమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. దీన్ని ఉచితంగా ఇవ్వబోమని, టెలికం రంగ నియంత్రణ సంస్థ TRAI నిర్ణయించే ధరను కంపెనీలు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ పరిణామం స్టార్ లింక్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు సానుకూలం కానుంది. ఈ స్పెక్ట్రంను వేలం వేయాలని దేశీ దిగ్గజాలు జియో, ఎయిర్ టెల్ కోరుతున్నాయి.