TG: ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ పై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పేరుతో దేశ అభివృద్దికి ఆటంకం కావొద్దని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు. దేశ సంపదను ముస్లింలకు మాత్రమే పంచి పెట్టాలనే మూల సిద్ధాంతం కాంగ్రెస్‌దని, మరి 80% ఉన్న హిందువుల సంగతి ఏంటని నిలదీశారు. దేశ సంపదకు ప్రతి పౌరుడు అర్హుడు అన్నారు.