GNTR: ప్రపంచ శిశు రక్షణా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించారు. ఇందులో భాగంగా నవజాత శిశు రక్షణ వార్డును ఆమె తనిఖీ చేశారు. శిశువుల కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, తల్లి పాలు పౌష్ఠికాహారం అందిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.