కోల్కతాలోని హత్యాచార కేసు బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసు, న్యాయవ్యవస్థపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతోందని ఓ లాయర్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సదరు న్యాయవాదిని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ మందలించారు. కోర్టులో ‘క్యాంటీన్ కబుర్లు’ చెప్పొద్దని.. అటువంటి జనరల్ స్టేట్మెంట్లు చేయొద్దని సూచించారు.