ఆస్ట్రేలియా Aతో జరుగుతున్న అనధికార రెండో టెస్టులో టీమిండియా 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధ్రువ్ జురెల్.. సహచరులు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా(80) పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జురెల్‌కు ఛాన్స్ ఇవ్వాలని భారత అభిమానులు కోరుతున్నారు. అయితే అతడికి అవకాశం దక్కాలంటే కివీస్ సిరీస్‌లో అంతగా రాణించని సర్ఫరాజ్‌పై వేటు పడనుంది.