ATP: అనంతపురం మున్సిపాలిటీ పరిధిలోని 18వ డివిజన్లో జరిగిన ఆక్రమణలపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఉదయం గుల్జార్ పేట కాలనీలో ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్కే నగర్లో చిన్న కల్వర్టు నిర్మించమని నెల క్రితం చెప్పినా పట్టించుకోకపోవడం ఏంటని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.