AP: గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కమీషన్ల కోసం అడ్డగోలుగా ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేశారని మండిపడ్డారు. ఐదేళ్లలో రూ.లక్షా 20 వేల కోట్ల అప్పులు చేశారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు భారం తప్పదని పేర్కొన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యతను తాను తీసుకుంటానని ప్రజలకు సీఎం హామీ ఇచ్చారు.