AP: వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. గుంటూరు-కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. తమ నేతలు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలను ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదన్నారు. శాంతిభద్రతలు అదుపు తప్పాయని డిప్యూటీ సీఎం పవన్ వాపోయిన సంగతిని గుర్తుచేశారు.