VSP: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ డిమాండ్ చేశారు. పెందుర్తి మండలం చినముషిడివాడలో గురువారం కార్మికుల సమస్యలపై ఆందోళన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పి తర్వాత హామీని విస్మరించినట్లు తెలిపారు.