PLD: సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ గురువారం రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కన్నా కలిసి సత్తెనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా వసతులు కల్పించాలని ఆకాంక్షించారు.