AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి సీఎం చంద్రబాబు చురకలంటించారు. ఇచ్ఛాపురం సబ్స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ కనపడకపోవటంతో సీఎం ఆరా తీశారు. ఆయన విజయవాడలోని కార్యక్రమంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ప్రజలతో సంబంధం ఉన్న కార్యక్రమాల్లో వీలైనంత వరకు తప్పించుకోకూడదని అన్నారు. నేరుగా హాజరుకాలేకపోయినా వర్చువల్గా అయినా పాల్గొనాలని సూచించారు.