AP: విద్యుత్ సమస్యలు లేకుండా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఇవాళ శంకుస్థాపన చేసిన పనులు ఏడాదిలో పూర్తి చేస్తాం. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలోని అసెంబ్లీలో విద్యుత్ కోతలపై చర్చ జరిగేది. కరెంట్ కోతలపై రైతులు ధర్నా చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి 1998లో విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చాం’ అని తెలిపారు.