ప్రకాశం: మార్కాపురంలో పట్టణంలో గురువారం ఉద్రిక్తత మొదలైంది. ప్రధాన రహదారులపై ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో పోలీసులకు, వ్యాపారాల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ.. ఆక్రమణ దారులకు ముందుగానే నోటీసులు జారీ చేశామన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజల కోసమే అక్రమణలు తొలగింపులు చేపడుతున్నామని అన్నారు.